జూలైలో వాయుసేనకు తొలి తేజస్ విమానం?

60చూసినవారు
జూలైలో వాయుసేనకు తొలి తేజస్ విమానం?
తేజస్ ఎంకే-1ఏ తొలి విమానం మరో 2 నెలల్లో వాయుసేన చేతికి అందే అవకాశం కనిపిస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) వర్గాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో యుద్ధవిమానాన్ని పూర్తిస్థాయిలో హాల్ పరీక్షించింది. ప్రస్తుతం ఇంటిగ్రేషన్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. జూలై కల్లా అవి పూర్తయ్యే అవకాశం ఉంది. హాల్ నుంచి రూ.48 వేల కోట్ల విలువైన యుద్ధ విమానాలను వాయుసేన కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్