గుజరాత్లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలగా.. దాదాపు 200 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ 'ఎక్స్'లో అధికారిక ఖాతాలో డీపీ మార్చింది. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.