ఎయిరిండియాకు బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్ (వీడియో)

57చూసినవారు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువకముందే ఎయిరిండియాకు చెందిన మరో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. థాయ్‌లాండ్‌లోని పుకెట్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా AI379 విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే ఫ్లైట్‌ను తిరిగి పుకెట్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 156 మంది ప్రయాణికులను వెకెట్ చేయించి, తనిఖీలు చేయగా బాంబు లేదని తేలింది.

సంబంధిత పోస్ట్