అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఫ్లైట్ AI171 గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్, ఎక్స్ ఖాతాలో తదుపరి అప్‌డేట్ ఇస్తామని ఎయిరిండియా తెలిపింది.