ఓ పెళ్లి వేడుకలో జరిగిన విచిత్ర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వధువు ఇంటిపై వరుడి తండ్రి
విమానం నుంచి నోట్ల కట్టలు కుమ్మరించాడు. ఈ ఘటన తాజాగా పాకిస్థాన్‌లోని హైదరాబాద్ - సింధ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. వధువు ఇంటిపై నగదు వర్షం కురిపించడానికి వరుడి తండ్రి ఏకంగా విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. పైనుంచి నోట్ల వర్షం కురుస్తుండగా దొరికిన వారు వాటిని ఏరుకున్నారు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.