TG: గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) హైదరాబాద్ చైర్మన్‌గా ఏకే ప్రధాన్‌ను నియమిస్తూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఉత్తర్వులు జారీ చేసింది. సీడబ్ల్యూసీలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారిగా ఉన్న ప్రధాన్‌కు హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (హెచ్ఏజీ)గా పదోన్నతి కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు గోదావరి జలాల సమస్య పరిష్కారం కోసం జీఆర్ఎంబీని ఏర్పాటు చేశారు.