అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కేవలం 6 పరుగులకు ఔట్ అయ్యారు. ఆకాశ్ దీప్ వేసిన 10.2 ఓవర్‌లో జో రూట్ క్లీన్‌బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 52/3గా ఉంది. క్రీజులో హ్యారీ బ్రూక్ (2), ఓలీ పోప్ (17) పరుగులతో ఉన్నారు.