నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలోనటించిన 'అఖండ- 2' టీజర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్‌కి పైగా వ్యూస్, 5.90 లక్షల+ లైక్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ వివరాలు తెలియజేస్తూ నిర్మాణ సంస్థ '14 రీల్స్ ప్లస్' ఆనందం వ్యక్తం చేసింది. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)ని పురస్కరించుకుని ఈ టీజర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.