అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ అక్కినేని వివాహానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జితో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా మార్చి 24న వీరు వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా, పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటివరకు అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.