ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావును అక్కినేని నాగ చైతన్య పరామర్శించారు. సర్వేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. 'తండేల్' మూవీ విజయం సాధించడంతో విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామిని నేడు నాగచైతన్య దర్శించుకున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని సర్వేశ్వర రావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి బాగోగులు తెలుసుకున్నారు.