అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ్ల పెళ్లి దగ్గరకు వస్తోంది. ఈ నేపథ్యంలో చైతూ- శోభిత మంగళస్నానాలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల సమక్షంలో హల్దీ ఫంక్షన్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి మంగళ స్నానాలు చేశారు. కాగా, డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8:13 గంటలకు నాగచైతన్య-శోభితల వివాహం జరగనుంది.