అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం-2025 థీమ్ ఏమిటంటే "IAAD యొక్క 10 సంవత్సరాలు.. సామూహిక పురోగతి యొక్క దశాబ్దం". ఈ థీమ్ గత 10 ఏళ్లలో ఆల్బినిజం గురించి అవగాహన పెంచడం, వివక్షను తగ్గించడంలో సాధించిన పురోగతిని సూచిస్తుంది. ఇంకా ఆల్బినిజం ఉన్నవారికి సమాన హక్కులు, సమాజంలో గౌరవం కోసం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని గుర్తు చేస్తుంది.