మీకు మద్యం సేవించే అలవాటు ఉందా.. ఆయితే తస్మాత్ జాగ్రత్త. మద్యం సీసాపై మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక రాసి ఉంటుంది. ఇది ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.