TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం జల్లా తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్‌లోని భీంపూర్లో 7, పెంబీలో 9.1, న్యాల్కల్లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.