దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17 కేసులు నమోదవ్వగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 7,383కి చేరింది. అత్యధికంగా కేరళలో 2007, గుజరాత్‌లో 1441, వెస్ట్ బెంగాల్‌లో 747, మహారాష్ట్రలో 578, కర్ణాటకలో 573, తమిళనాడులో 243, ఉత్తరప్రదేశ్‌లో 238, ఏపీలో 101, తెలంగాణలో 9 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 97 మంది మృతి చెందగా.. నిన్న ఒక్కరోజే 10 మంది ప్రాణాలు విడిచారు.