తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినవద్దని హెచ్చరించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.