ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. దీంతో సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తిరుపతి ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు. 500KM ప్రయాణించిన తర్వాత కార్లు అధికంగా వేడెక్కడం, ఘాట్‌రోడ్డులో వెళ్లడంతో ఇతర లోటుపాట్లు తోడై వాటిలో మంటలు వ్యాపిస్తున్నాయన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.