APPSC గ్రూప్ 1 పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి మెయిన్స్ పరీక్షకు వైట్ పేపర్‌తో కూడిన బుక్‌లెట్‌ను మాత్రమే అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రూల్డ్ బుక్‌లెట్ స్థానంలో తెల్ల పేపర్లు ఇవ్వాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు ప్రకటించారు. ఈ మేరకు పరీక్షలు బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే రాయాలని తెలిపారు. స్కెచ్ పెన్నుతో రాస్తే మాల్‌ప్రాక్టీసు కింద గుర్తిస్తామని పేర్కొన్నారు.