తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ వాయిదా పడింది. జూన్ 18వ తేదీ నుంచి జులై 8వ తేదీ వరకు గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ మంగళవారం ప్రకటన చేసింది. కొత్త తేదీల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.