తెలంగాణలో పలు ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడటంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. శనివారం సైతం పలు జిల్లాల్లో ఈదురు గాలులు, తెలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.