స్టేట్ బ్యాంక్
ఇండియా కొత్తగా తీసుకొచ్చిన ‘అమృత్ వృష్టి’ FD పథకంలో 7.25% వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. 2025 మార్చి 31 వరకు ఈ స్కీం అందుబాటులో ఉండనుంది. SBIలోని ఇతర FD పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ వచ్చే స్కీం ఇదే. SBI శాఖలు, యోనో SBI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దీనిలో FD చేయవచ్చు. అటు 400 రోజులకు ‘అమృత్ కలశ్’ పేరిట అందించే పథకంలో 7.10% వడ్డీ లభిస్తోంది.