తెలంగాణలో ఎండలు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో, ఫిబ్రవరిలోనే ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు పెరిగినట్లు తెలిపింది. సాధారణంకన్నా 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. ఈవారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిఒక ప్రకటనలో సూచించింది.