TG: ఫ్యూచర్‌సిటీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్‌సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. అక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదని, గ్రేటర్ పరిధిలో స్మార్ట్‌పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఓఆర్‌ఆర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.