'LPG సిలిండర్ వాడే వారంతా ఆ పని చేయాల్సిందే!'

58చూసినవారు
'LPG సిలిండర్ వాడే వారంతా ఆ పని చేయాల్సిందే!'
LPG సిలిండర్లకు సంబంధించి నకిలీ వినియోగదారులను తొలగించేందుకే ప్రభుత్వ అధీనంలోని చమురు రంగ సంస్థలు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి తెలిపారు. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన లేఖపై ఆయన ఈ మేరకు స్పందించారు. కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు నకిలీ వినియోగదారుల ఖాతాలతో సిలిండర్లు బుక్ చేస్తున్నాయని, దాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య చేపట్టినట్లు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్