జూనియర్ ఎన్‌టీఆర్ వీరాభిమాని, కేన్సర్‌తో పోరాడుతున్న కౌశిక్‌తో గతంలో యంగ్ టైగర్ వీడియో కాల్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన చికిత్సకు అవసరమైన ఖర్చులు భరిస్తానని మాటిచ్చి, ఇప్పుడు తప్పారని కౌశిక్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై నటి మాధవీలత స్పందించారు. ఈ రకంగా ఫ్యాన్స్‌కు డబ్బులిస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలన్నారు. డబ్బులు ఆశించే వాళ్లు అభిమానులు ఎలా అవుతారని మండిపడ్డారు.