యంగ్ హీరో నాగచైతన్య నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలపై నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగామని తెలిపారు. టికెట్ ధరలు రూ.50 పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం అడగలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో తండేల్ బెనిఫిట్ షోలు లేవు, అంత బెనిఫిట్ మాకు వద్దు అంటూ వ్యాఖ్యానించారు.