ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ శంకర్‌పైన సోషల్ మీడియాలో ఒకతను అనుచిత పోస్టులు పెట్టాడు. దీనిపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతను అల్లు అర్జున్ ఫ్యాన్ అని పవన్ కల్యాణ్ మీద కోపంతోనే పోస్ట్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.