ఇటీవల పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలంటే ఆ సినిమా హీరో యాంటీ డ్రగ్స్ వీడియో ఒకటి చేసి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు బన్నీ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. కాగా, పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది.