1930లో అమెరికాలో ఇంజినీర్లు ఓ చరిత్రాత్మక అద్భుతాన్ని సాధించారు. ఇండియానా రాష్ట్రంలోని ఇండియానా బెల్ అనే 8 అంతస్థుల భవనాన్ని 90 డిగ్రీలు తిప్పి మరీ వేరే దిశలోకి కదిలించారు. దాదాపు 11 వేల టన్నుల బరువున్న ఈ భవనాన్ని కదిలించడానికి 31 రోజులు పట్టింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ సమయంలో 600 మంది ఉద్యోగులు భవనంలోనే ఉన్నారు. కానీ, భవనం కదిలిపోతున్న విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోయారు.