మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ మంగళవారం తన కుటుంబంతో కలిసి పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలందరిపైనా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. కుంభమేళా సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు అనంత్ తెలిపారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం ‘తీర్థ యాత్రి సేవ’ పేరిట వివిధ సేవలను అందిస్తోంది.