ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసేందుకు ఖతార్ రాజధాని దోహాకు బయలుదేరారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంబానీ ఆయన్ని కలుసుకోవడం ఇది రెండోసారి కాగా, బుధవారం ఖతార్ ఎమిర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విందులో ఆయన హాజరుకానున్నారని సమాచారం. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు ఖుష్నర్ హాజరైన సంగతి తెలిసిందే.