మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పనికిరారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అప్పటి ప్రజారాజ్యమే.. ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు చేసిన వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్లే.. పవన్ కల్యాణ్ జనసేనని BJPలో కలుపుతారా అని ప్రశ్నించారు. జనసేనను కూడా BJPలో విలీనం చేస్తారేమో పవన్ చెక్ చేసుకోవాలని సూచించారు.