దేశవ్యాప్తంగా ఏప్రిల్ 13-25 వరకు 12 రోజుల పాటు BJP అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా తెలంగాణలో 13న అంబేద్కర్ విగ్రహాల వద్ద పార్టీ శ్రేణులు స్వచ్ఛ భారత్ నిర్వహించి, పూలతో అలంకరించి నివాళి అర్పించనున్నారు. 14న అంబేద్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం చేయనున్నారు. 15-25 వరకు జిల్లా కేంద్రాల్లో రాజ్యాంగంపై సెమినార్లు నిర్వహణ, దళితుల ఇళ్లలో బీజేపీ నాయకులు భోజనం చేయనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ వెల్లడించారు.