బాలికపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం

55చూసినవారు
బాలికపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం
కేరళలో దారుణ ఘటన వెలుగుచూసింది. పతనంతిట్టలో 10 ఏళ్ల బాలికపై ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎర్నాకుళంలోని వడయంపాడికి చెందిన సుధీర్ రమేశ్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం అతను బాలికను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లి సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్