ఉక్రెయిన్‌కి బాసటగా అమెరికా

60చూసినవారు
ఉక్రెయిన్‌కి బాసటగా అమెరికా
వాషింగ్టన్‌లో జరుగుతున్న నాటో దేశాధినేతల సదస్సు ప్రారంభోపన్యాసంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు తాము ఐదు వ్యూహాత్మక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌, ఇతర ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసేందుకు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, రొమానియాతో కలిసి పనిచేస్తామని వివరించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్‌ జోస్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్