బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక
అమెరికా హస్తం ఉందనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆమె కొన్ని నెలలక్రితం సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడమే కారణమని భావిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై.. నిరసనల మధ్య అమె కట్టుబట్టలతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.