అమ్మోనియా గ్యాస్ లీక్..10 మందికి అస్వస్థత

82చూసినవారు
అమ్మోనియా గ్యాస్ లీక్..10 మందికి అస్వస్థత
నెల్లూరు జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. టీపీ గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్‌ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో కార్మికులు ఊపిరాడక పోవడంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యం వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్