సంస్థ నుంచి రూ.3.2 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్

74చూసినవారు
సంస్థ నుంచి రూ.3.2 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
అమెజాన్ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను కాజేసిన ఆ సంస్థ ఉద్యోగిని సైబారాబాద్‌ EOW పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థలో సీనియర్‌ ఫైనాన్షియల్‌ ఆపరేషనల్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్న నిందితుడు ఎం. వెంకటేశ్వర్లు సంస్థలో రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులను పక్కదారి పట్టించాడు. 184 మంది ఉద్యోగుల నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్లించాడు. బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు నగదు మళ్ళించాడు.

సంబంధిత పోస్ట్