రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో కొలువైన జైన మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన ఓ వృద్ధుడు అమ్మాయిని అసభ్యకరంగా ఫొటో తీసి దొరికిపోయాడు. మందిరానికి ఓ అమ్మాయి షార్ట్స్ వేసుకొని వచ్చింది. ఈ క్రమంలో ఓ వృద్ధుడు ఆమె కాళ్ల ఫొటోను తీశాడు. అది గమనించిన సదరు యువతి ఆ వృద్ధుడిని నిలదీసింది. మొబైల్ గ్యాలరీ ఒపెన్ చేయగా తన ఫొటో ఉండడంతో దానిని డిలీట్ చేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.