ద్రవిడ్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

74చూసినవారు
ద్రవిడ్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు
భారత మాజీ ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. తన బోనస్‌ విషయంలో ద్రవిడ్ తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం అంటూ కొనియాడారు. ‘‘ఈ వ్యక్తి విలక్షణానికి ప్రతీక. అందుకే ఆయన ఎంతోమందికి రోల్‌మోడల్‌ అయ్యారు’’ అని ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల రిటైర్‌ అయిన ద్రవిడ్‌కు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించగా.. ద్రవిడ్‌ మాత్రం తన బోనస్‌ను సగానికి తగ్గించాలని కోరారు.

సంబంధిత పోస్ట్