విజయ్ దేవరకొండ, అనన్యా పాండే కలిసి నటించిన మూవీ లైగర్. ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో నటించిన అనన్యా తండ్రి చంకీ పాండే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లైగర్‌లో అవకాశం వచ్చినప్పుడు అనన్యా ఎంతో అసౌకర్యంగా ఫీలైంది. హీరోయిన్ పాత్రకు సెట్ కానని… చిన్న పిల్లలా కనిపిస్తానని అనుకుంది. బిగ్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే పేరు వస్తుందని చెప్పి నేనే ఒప్పించాను' అని అన్నారు.