TG: మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలో అంగన్వాడీ ఆయా దారుణానికి పాల్పడింది. కత్తిని కాల్చి ఐదేళ్ల మణిదీప్‌కు వాతలు పెట్టింది. ఆయా తీరుపై చిన్నారి తల్లిదండ్రులు సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా సీడీపీవో పట్టించుకోలేదని ఆరోపిస్తూ బుదవారం ఆందోళనకు దిగారు. ఆందోళన చేపట్టిన చిన్నారి బంధువులను ఆయా బంధువులు దూషించడం తో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.