TG: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫర్నిచర్, ఆట వస్తువులు, ప్రీ-ప్రైమరీ విద్య, యూనిఫాంలు అందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. ప్రజలకు తెలియజేసేందుకు వీడియోలు ప్రచారం చేయాలని మంత్రి ఆదేశించారు.