ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో వారి కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన సందర్భంగా.. అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చారని సమాచారం. ఆమె రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.