రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా
అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ధీరూభాయ్
అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో 3000 మంది పిల్లల మధ్య నీతా
అంబానీ ఈ వేడుకను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 1.4 లక్షల మందికి 'అన్నసేవ' ద్వారా అన్నదానం చేశారు. ఇందులో దాదాపు 75 వేల మందికి వండిన ఆహారాన్ని అందించగా, సుమారు 65 వేల మందికి ముడి రేషన్ పంపిణీ చేశారు.