రానున్న 20 ఏళ్లలో భారత్, దక్షిణాసియాలోని పౌర విమానయాన సంస్థలు కొత్తగా 2,835 విమానాలను సమకూర్చుకునే అవకాశముందని బోయింగ్ వెల్లడించింది. రాబోయే రెండు దశాబ్దాలలో పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్రాంతంలోని విమానయాన సంస్థలకు ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ఆధునిక విమానాల అవసరముంటుందని తెలిపింది. వీటిలో న్యారో బాడీ విభాగంలో 2,445, వైడ్‌బాడీ సెగ్మెంట్‌లో 370 విమానాలకు డిమాండ్ ఉండొచ్చని పేర్కొంది.