'కాంతార-2' షూటింగ్‌లో మరో ఆర్టిస్ట్ మృతి

80చూసినవారు
'కాంతార-2' షూటింగ్‌లో మరో ఆర్టిస్ట్ మృతి
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తోన్న 'కాంతార-2' సినిమా షూటింగ్‌లో వరుస అపశృతులు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 6న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ సౌపర్ణిక ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయారు. 'కాంతార' సినిమాలో హీరో ఫ్రెండ్‌గా నటించిన రాకేశ్ పూజారి కూడా మే 12న గుండెపోటుతో చనిపోయారు. తాజాగా కేరళకు చెందిన మరో ఆర్టిస్ట్ విజు వికె బుధవారం అర్ధరాత్రి ఛాతి నొప్పితో మరణించారు. దీంతో చిత్ర బృందంలో ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్