TG: మేడ్చల్‌లో వరుస హత్య కలకలం రేపుతున్నాయి. నిన్న మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట జాతీయ రహదారిపై దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ హత్య జరిగి 24 గంటలు గడవక ముందే మేడ్చల్‌లో మరో దారుణ హత్య జరిగింది. మండలంలోని కిష్టాపూర్ రాఘవేంద్ర కాలనీకి చెందిన వెంకటరమణను అతని అక్క కొడుకు తన ఇంట్లోనే మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.