TG: సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న అఘోరి.. తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.