TG: సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు అయింది. ఇన్‌స్టా వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని పేర్కొంటూ కీర్తన అనే బాధితురాలు తాజాగా HYD సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్‌లైన్ వేదికగా వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆధారాలను పోలీసులకు అందించారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రిజం పబ్ వ్యవహారంలో కల్పికపై ఇప్పటికే కేసు నమోదు అయింది.